ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ మహిళా ఎస్సై
నిర్మల్, ఫిబ్రవరి 26 (మనఊరు న్యూస్): జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సోదలు నిర్వహించగా ఎక్సైజ్ మహిళా ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్ లంచం తీసుకునే విషయంలో పట్టుబడ్డారు. భైంసా మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు తెల్ల కల్లు వ్యాపారులు తమకు అనుమతించిన పరిధిలో తెల్లకల్లు అమ్ముకునే విషయంలో వివాదం తలెత్తింది. నిర్మల్ జిల్లాలోని కమోల్ గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి సుభాష్ గౌడ్ ఇటీవల ఒకరు తెల్లకల్లు అమ్మకం తమకు కేటాయించిన పరిధి కాకుండా ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి సుభాష్ గౌడ్ హద్దులోకి ఇతరులు రాకుండా చూసుకోడానికి .మహిళా ఎస్సె దాదాపు పదివేల రూపాయల లంచం అడిగినట్లు ఫిర్యాదు దారుడు ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై, కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిర్మల్ లో గత ఆరు నెలల్లో 12వ ఏసీబి దాడులు కావడం గమనార్హం. స్టేషన్‌లలోనే అనేక కేసులను సెటిల్‌మెంట్ చేశాడు. ఇరుపక్షాల నుంచి భారీగా డబ్బులు దండుకున్నాడు. తాను ఒంగోలులోని కీలక పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐని అని చెప్పి వైద్యశాలలు, గ్రానైట్ వ్యాపారులు, ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడు. గత వైసీపీ పాలనలో ఆయన అవినీతి వ్యవహారం నిర్విఘ్నంగా కొనసాగింది.