రేషన్ బియ్యం 37 క్వింటాళ్లు పట్టివేత

 రేషన్ బియ్యం 37 క్వింటాళ్లు పట్టివేత    

                       

జడ్చర్ల రూరల్, మార్చి 8 (మ



నఊరు న్యూస్): పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కుల ఆగడాలతో పక్కదోవ పడుతున్నాయి.రెషన్ బియ్యాన్ని అర్ధరాత్రి తరలిస్తుండగా గ్రామస్తులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించ్చారు. ఎస్సైలు జయప్రసాద్, చంద్రమౌళి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 12 గుంటల ప్రాంతంలో గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న బొలెరోను పోలీస్ స్టేషన్ కు తరలించి సిజ్ చేశారు. జడ్చర్ల మండల పరిధిలో నసురుల్లాబాద్  గ్రామంలో డీలర్ సయ్యద్ అన్వర్ షాప్ దగ్గర షాప్ నంబర్ 36 గ్రామస్తులు చూస్తుండగా బొలెరోలో 37 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం  ప్రజలకు రేషన్ షాప్ దగ్గర కంటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  ఈ క్రమంలో డ్రైవర్ పోలీసులను చూసి బొలెరోను వదిలి పరారయ్యాడు రేషన్ బియ్యం  పోలీస్ స్టేషన్ కు తరలించి బొలెరోను సీజు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.

Previous Post Next Post