జడ్చర్లలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
జడ్చర్ల రూరల్, మార్చి 8 (మనఊరు న్యూస్): పట్టణంలోని ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అధ్యక్షురాలు బాలమణి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు బాలమణీ మాట్లాడుతూ.. మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారిలోని ప్రతిభను గుర్తించి కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జయమ్మ, అనిత, లక్ష్మి, గోనెల రాధాకృష్ణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
