జడ్చర్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
జడ్చర్ల రూరల్, మార్చి 8 (మనఊరు న్యూస్): మహిళలకు హక్కులు, సమాన అవకాశాలు కల్పనతో మహిళా సాధికారత సమాజాభివృద్ధి జరుగుతుందని జడ్చర్ల జనతా రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షులు ఫకీర్ జహంగీర్ పాషా అన్నారు. మున్సిపాలిటీలోని పాత బజార్ 6 వ వార్డ్ ఎస్సీ కమిన్యూటి హల్ లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలను సన్మానించి వయోవృద్ద మహిళలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిజిపిఏ ఉపాధ్యక్షులుశ్రీశైలమ్మ, పార్వతమ్మ, అరుణ, కుర్షిత్ బేగం, మాధవి, రమా, తదితరులు పాల్గొన్నారు.
