మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి కార్యదర్శిగా లక్ష్మికాంతమ్మ
ఖమ్మం, మార్చి 8 (మనఊరు న్యూస్): మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి కార్యదర్శిగా పత్తిపాటి లక్ష్మికాంతమ్మను నియమించి నట్లు మానవహక్కుల ప్రజాపరిరక్షణ సమితి జాతీయ చైర్ పర్సన్ డాక్టర్. చల్లమల హైమావతి అందజేసినట్లు శనివారం ఆమె విలేకర్లలకు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం మానవహక్కుల ప్రజాపరిరక్షణ సమితి కార్యాలయంలో పత్తిపాటి లక్ష్మికాంతమ్మకి గతంలో ఆమె చేసిన సామజిక సేవను గుర్తించి, మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి సంస్థలో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా నియమించి ఐడి కార్డు ఇవ్వడం జరిగినది. ఖమ్మం జిల్లా లాయర్, రాష్ట్ర అధ్యక్షురాలు పద్మావతి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అంటూ సేవనే జీవితంగా మలుచు కొని మహిళా సంఘాలలో పనిచేస్తు వారి సమస్యలలో నేనున్నాను అంటూ సాగిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
