మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

 మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

 స్టేట్ టీచర్స్ యూనియన్

   


రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ ) నాగర్ కర్నూల్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లలో నాగర్ కర్నూల్ జిల్లా శాఖ మహిళా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం.పర్వత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యస్ మురళి,కొత్త శ్రీధర్ రావు లతో కలిసి పాల్గొన్నారు. వారికి మహిళా ఉపాధ్యాయులు శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశం కన్వీనర్ మాధవి,కో కన్వీనర్ వజ్రమ్మ ,సరళ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమం సమావేశంలో ఉద్దేశించి పర్వత్ రెడ్డి ప్రసంగిస్తూ గత ఏడున్నర దశాబ్దాలుగా దేశంలో స్త్రీలకు పురుషులకు సమాన హోదా కల్పించే ఎన్నో ప్రణాళికలు రూపొందించబడ్డాయని, వాటినిఅందిపుచ్చుకుంటూ కొంత పురోగతిని ఆధునిక స్త్రీ సాధించినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాలలో గతకాలపు పిత్రు స్వామ్య వ్యవస్థ ఆధిపత్య ధోరణి తగ్గలేదని రాజ్యాంగ ఫలాలు వచ్చినా పూర్తిగా పొందలేకున్నారని అన్నారు. పురుషుడుతో సమానంగా కుటుంబంలో ఆర్థిక పాత్ర పోషిస్తున్న స్త్రీలు మగవారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎదురౌతున్న రకరకాల సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారని ఇది గమనించిన ప్రభుత్వం 2001ని మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది. ఫలితంగా వివిధ రకాల చట్టాలు మహిళల పురోభివృద్ధికి రూపొందించబడ్డాయి కనుక ఆధునిక మహిళ తన సామాజిక భావోద్వేగ సాంస్కృతిక, ఆర్థిక అవసరాలను సంతృప్తి పరచుకునేందుకు సాధికార దృక్పథంతో ముందుకు సాగాలని,స్త్రీ పట్ల పురుషుడు తన దృక్పథం లోనూ మంచి మార్పు రావాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సృజన, వేదవతి, స్వరూప, సరళ, మణి, ఇష్రత్ బేగం, యాదమ్మ, సుజాత, పద్మలతారెడ్డి తదిరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post