ఉపాధి మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం....
నాగర్ కర్నూల్, మార్చి 8 (మనఊరు న్యూస్): మండల సమావేశం మందిరంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధి శాఖ మహిళ ఉద్యోగులను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ డిఆర్డిఓ రాజేశ్వరి హాజరై మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.మహిళలు సాధికారత దిశ వైపు నిత్యం పయనిస్తూ ఉండాలని సూచించారు.మహిళలలో చైతన్యం,వారు అభివృద్ధి సాధించినప్పుడే సామాజికం బాధ్యతవైపు,అభివృద్ధి దిశలో పయనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కోటేశ్వర్లు, శ్రీనివాసులు, ఆనంద్, పవన్ జేఏసీ చైర్మన్ బాలయ్య, సిటిఏ రాజేష్ కుమార్, శ్రీనివాసులు, మల్లికార్జున్, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, లక్ష్మి, మంజుల, నాగమణి, మానస, మహేందర్, ప్రవీణ్, బాలరాజు, పాల్గొన్నారు.