చిన్నారులకు టీకాలు వేయడంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం వద్దు

 చిన్నారులకు టీకాలు వేయడంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం వద్దు

జిల్లా టీకాల అధికారి డాక్టర్ కే. రవికుమార్ నాయక్



నాగర్ కర్నూల్, మార్చి 8 (మనఊరు న్యూస్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతి బుధవారం, శనివారం సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సూచించిన ప్రాంతాలలో వైద్యారోగ్య సిబ్బంది ద్వారా 12రకాల వ్యాధి నిరోధక టీకాలు చిన్నారులకు సూచించిన సమయం లో తప్పనిసరిగా వేయాలని జిల్లా టీకాలు అధికారి డాక్టర్ కే రవికుమార్ నాయక్ అన్నారు.

శనివారం నాడు మున్ననూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకా నిల్వలు సిబ్బంది ఏ ఆరోగ్యం కేంద్రాలకు వ్యాక్సిన్ నిలువలు తీసుకుపోయినారు వివరాలను ప్రత్యేక రికార్డులను ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు.అన్ని రకాల వ్యాక్సిన్ లను ప్రభుత్వం సూచించిన శీతోష్ణస్థితి లోనే భద్రపరచాలని అన్నారు.

నవజాత శిశువులకు చిన్నారులకు పుట్టినరోజు నుండి 15 సంవత్సరాలలోపు వారందరికీ ప్రభుత్వం సూచించిన 12 రకాల వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా సూచించిన సమయంలోనే వేయాలని అన్నారు. చిన్నారులకు టీకాలు వేయుటలో వైద్య ఆరోగ్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఏ మేరకు ఉండరాదని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ శ్రీకాంత్, స్టాఫ్ నర్స్, సిబ్బంది యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post