పారిశుద్ధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివి
తపస్ జిల్లా అధ్యక్షులు సునీల్ కుమార్
మహబూబ్ నగర్, మార్చి 8 (మనఊరు న్యూస్): పట్టణంలో పరిశుభ్రతను కాపాడుటకు వేకువజాము నుండి మొదలుపెట్టి రాత్రి వరకు నిరంతరాయంగా కృషి చేస్తున్న పారిశుద్ధ్యకార్మికుల సేవలు వెలకట్టలనివని తపస్ జిల్లా అధ్యక్షులు బొల్లం సునీల్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పౌరుల ఆరోగ్యాన్ని, కాపాడుతున్న కార్మికుల మహిళలను సన్మానించుకోవడం మనందరికీ గౌరవమని అన్నారు. సమాజంలో చిట్టచివరి వారిని గుర్తించి వారిని గౌరవించడమే సంఘ ధ్యేయమన్నారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని సన్మానించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు నాయుడు, కోశాధికారి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు శోభ, కరుణాకర్ గౌడ్, గోపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, నాగరాజ్, నాగేశ్వర్ రెడ్డి, వెంకటేష్, సుధీర్, మండలాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా బాధ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు, పాల్గొన్నారు.
