*వైభవంగా పాలెం వెంకన్న దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు*
బిజినపల్లి, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల శ్రీ అలర్మెల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైత్రమాస శనివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగినట్లు ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు. ఈరోజు 36 కుటుంబాలతో సామూహికంగా వ్రతాలు చేశారని, శ్రీసత్యనారాయణ స్వామి కథ విన్న, పూజించిన, విశేష ఫలితం ఉంటుందని అన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన వారికి ఫలితం దక్కుతుందన్నారు. భక్తులకు సంకల్పించిన కోరికలు నెరవేరుతాయి అనీ అన్నారు. ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు దేవాలయంలో చేయనున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం భక్తులకు పాలెం బాలాజీ అన్నదాన సత్రం నందు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారుఅని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్త గాడి సురేందర్, కృష్ణ గౌడ్,అర్చకులు జయంత్, శుక్లా, చక్రపాణి, ఆలయ సిబ్బంది బాబయ్య, ఆర్ శివకుమార్, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.