గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న బిఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్, జూన్ 14 (మనఊరు ప్రతినిధి): ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా అత్యధిక స్థాయిలో అత్యధిక బ్లడ్ యూనిట్లను సేకరించినందుకుగాను గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డ్ ను టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందుకున్నారు. హైదరాబాద్ లోని రాజ్భవన్ లో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఇంకొకరి జీవితంలో వెలుగులు నింపాలని, ఒక్కరు రక్తదానం చేస్తే ముగ్గురి జీవితాలు కాపాడిన వారమవుతామని ప్రతి ఒక్కరు సంవత్సరంలో కనీసం ఒకటి, రెండు సార్లు రక్తదానం చేయాలని అది జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ఆయన అన్నారు. గవర్నర్ కి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదయ్య, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.