విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
పాఠశాల హెచ్‌యం ఎస్. కల్పన
దేవరకద్ర, జులై 17 (మనఊరు ప్రతినిధి): విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ యం ఎస్. కల్పన అన్నారు. గురువారం లక్ష్మీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు తొలి సారిగా సరఫరా చేసిన రాతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విద్యనభ్యసించి తమ తల్లిదండ్రులకు తమ మంచి పేరు తీసు కురావాలన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోని చదువులో రాణించాలని నిర్ణయించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులకు రూ 9 వేల విలువైన రాత పుస్తకాలు రావడంతో విద్యార్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు రాత పుస్తకాలు సైతం ఉచితంగా పంపిణీ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అశ్వినిచంద్రశేఖర్, విజయలక్ష్మీ, నాగేశ్వర్ రెడ్డి, విద్యార్థులు ఉన్నారు.