65 ఏళ్ల వయసులో న్యాయం కోసం పోరాటం
జడ్చర్ల రూరల్, జులై 11 (మనఊరు ప్రతినిధి): మనది అనుకున్నది ఎప్పటికైనా మనల్ని చేరుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ మనదనుకున్న సొత్తు వేరే వారి సొంతం అయితే పడే బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. దాన్ని తిరిగి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై సంవత్సరాల పాటు తన భూమి కోసం పోరాటం చేసింది రైతు. ఆమె వయసు అక్షరాల 65 సంవత్సరాలు ఈ వయసులో కూర్చుంటే నిలబడలేని పరిస్థితి కానీ తనకు తెలియకుండా తన పొలం లో నుంచి నాలుగు గంటల భూమి నీ అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న వారి పై చర్యలు తీసుకోవాలని మండలానికి చెందిన మండ్ల వెంకటమ్మ పోరాటం ఫలించేనా... వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని శిఖర్ గాని పల్లి గ్రామానికి చెందిన మండ్ల వెంకటమ్మ కు సర్వే నంబర్ 887లో 34 గుంటల భూమి కలదు. ఇది తన అత్తగారి ఇంటి నుంచి వచ్చిన ఆస్తిగా సమాచారం. తన కున్న 34 గుంటల భూమిని తన సమీప బంధువులు కొందరు తన ప్రమేయమే లేకుండా నాలుగు గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో దాదాపు ఆరేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసి ఈ మధ్యనే తన పేరుమీదకు చేయించుకున్నట్లు తెలిపింది. కానీ తనకు అన్యాయం చేసిన వారి మాత్రం ఇప్పటి వరకు ఎన్ని పిర్యాదులు చేసిన కూడా జడ్చర్ల పోలీసు స్టేషన్ లో కేసులు నమోదు చేసి కూడా చర్యలు తీసుకోలేదని వాపోయింది. దీంతో ఈ నెల రెండవ తేదీ జిల్లా ఎస్పీ కి రిజిస్టర్ పోస్టు ద్వారా పిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు అన్యాయం చేసిన వారి పై చట్టపరంగా శిక్ష వేసేంత వరకు తన పోరాటం ఆగదని ఆమె పేర్కొన్నారు. జిల్లా పోలీసు బాసు ఇప్పటికైనా ఈ వృద్ధురాలికి న్యాయం చేస్తే బాగుండునని ఈమె గురించి తెలిసిన వారు కోరుతున్నారు.