రైతులకు డబ్బులు ఎగ్గొట్టిన వ్యాపారి
చెల్లని చెక్కలతో రైతులతో చెలగాటం
రైతులకు ఫిర్యాదు
నవాబుపేట, జూలై 10 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రానికి చెందిన దేవరకొండ బాలరాజు అనే కమీషన్ కంపెనీ పలు గ్రామాలలో రైతులు కొనుగోలు చేసిన వారి ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఎగ్గొట్టాడు. డబ్బుల కోసం రైతుల కాళ్లకు చెప్పులు అరిగేలా ఆయన చుట్టూ తిరిగారు. వారికి చెల్లించాల్సిన డబ్బులు బాల్ రాజ్ చెల్లించకపోగా చెల్లని చెక్కులు రాసి వారికి ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో విసిగి వేసారిన మండల పరిధిలోని దొడ్డిపల్లి గ్రామానికి చెందిన కొత్త కాపు యాదిరెడ్డి బుధవారం బాల్ రాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 1,95,000 అలాగే తమ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల ఆంజనేయులు దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 1,60,000 రూపాయలు ఇవ్వకుండా చెల్లని చెక్కులు ఇచ్చాడని. అందుకు సంబంధించి చెల్లని చెక్కులు ఇచ్చాడని అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని ఆయన చెప్పారు. ఈ విషయమై బాధితుడుదిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న ఎస్సై విక్రమ్.