*ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ గా విధులలో చేరిన డాక్టర్ టి. ఉషారాణి*
నాగర్ కర్నూల్, జూలై 10 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించి ఆసుపత్రులకు మెడికల్ సూపరింటెండెంట్ లుగా ఆదేశాలు జారీ చేశారు.నిలోఫర్ ఆసుపత్రి హైదరాబాద్ నుండి పదోన్నతిపై వచ్చిన చిన్న పిల్లల ప్రత్యేక వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ టి.ఉషారాణి గురువారం నాడు నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వైద్య పర్యవేక్షకులుగా విధులలో చేరారు.ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.రఘు ఆమెకు ఆహ్వానం పలికారు.ఈ కార్యక్రమంలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్ నాయక్,డాక్టర్ సూర్యనారాయణ, కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) సీ.జే.వసంత్ కుమార్, పరిపాలన అధికారి కే. రామచంద్రయ్య,సాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు.