పేదల ఆరోగ్య రక్షణ కోసం వైద్య శిబిరాలు
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఉచిత కంటి వైద్య శిభిరం
5వ రోజు కొనసాగుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం...
కల్వకుర్తి, జులై 9 (మనఊరు ప్రతినిధి): మారుమూల పేదల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం సికెఆర్ ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య నిర్వహిస్తున్శ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలందించేందుకు ఐక్యత ఫౌండేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారన్నారు. కంటి సమస్యలు వస్తున్న నేపద్యంలో వైద్యం చేయించుకోని పరిస్థితులు ఉంటాయని, వారందరికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆపరేషన్స్, కళ్ళజోడ్లు అందించాలని అందించినట్లు చెప్పారు. కంటి వ్యాధితో బాధపడుతూ ఉచిత వైద్య సేవలు అందుకోలేక పోతున్న పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. రెండు రోజులుగా "52మంది" కంటి శుక్లాల పేషెంట్లకు విజయవంతంగా సర్జరీలు పూర్తి... ఐదవ రోజు 1000 మందికి పైగా కంటి శిబిరాన్ని సందర్శించగా.. 700 మందికి కంటి పరీక్షలు నిర్వహణ.. 35 మంది పేషెంట్లు కంటి శుక్లాల సర్జరీకి ఎంపిక.. 350 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి.. ఒక వ్యక్తి కంటి చూపు, ఒక కుటుంబాన్ని నడిపించే వెలుగైతుందని నింపుతుందని, ఈ మధ్య కాలంలో కంటి సర్జరీలు, కంటి పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి అని, ప్రతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల మూలంగా కంటి వైధ్యం నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశ్యంతో, ప్రతి పేదవాడికి కంటి సమస్యను పరిష్కరించే సంకల్పంలో బాగంగానే... ప్రతి మండలంలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని...
ఐదు రోజులుగా 4వేల మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా, 2900కి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 155 మంది పేషెంట్లను కంటి శుక్లాల సర్జరీకి ఎంపిక చేయడం జరిగిందని,1550కి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,మరో రెండు రోజులు(శుక్రవారం వరకు)సమయం ఉందని ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకొని తమ కంటి సమస్యలు తొలగించుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ డాక్టర్ అలెక్స్ తో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు
రచ్చ శ్రీరాములు, నరేందర్ గౌడ్, యూసుఫ్ బాబా, గణేష్, రఘు, శ్రీపతి, శేఖర్, రాఘవెంధర్, శ్రీను, నాగిళ్ల శివ, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.