ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా వెంకటస్వామి

 తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటస్వామి

 


నాగర్ కర్నూల్, జూలై 9 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే-ఐజేయు 4వ జిల్లా మహాసభల్లో భాగంగా టీయూడబ్ల్యూజే-ఐజేయు అనుబంధ సంఘం

తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటస్వామి (ఏబీఎన్ టీవీ) ఉపాధ్యక్షులుగా రాఘవేంద్ర (బిగ్ టీవీ), చాంద్ పాషా (10 టీవీ), భరత్ (రాజ్ న్యూస్), తాహెర్ (ఎన్ టీవీ), ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ (వీ 6), సతీష్ (ప్రైమ్ 9), పీ.పర్శ రాములు (4 సైట్ న్యూస్), జాయింట్ సెక్రెటరీగా ఆర్.భరత్ (ఫోకస్ టీవీ), కోశాధికారిగా కేశవులు (టీ న్యూస్), సభ్యులుగా తారకేష్ గౌడ్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్యామ్ సుందర్, జిల్లా కన్వీనర్, కోకన్వీనర్లు సుదర్శన్ రెడ్డి, రాములు నాయక్ అభినందించారు.

Previous Post Next Post