భూనిర్వాషితులకు మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం అందివ్వాలి
మక్తల్, జులై 10 (మనఊరు ప్రతినిధి): నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్ క్రింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం మార్కెట్ రెట్ ను దృష్టిలో పెట్టుకుని పరిహారం అందివ్వాలని భూనిర్వాషితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. స్థానిక ఎస్ఆర్ ఫంగ్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన భూనిర్వాశిత రైతుల సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు జి వెంకట్రామారెడ్డి,జిల్లా కన్వీనర్ మచ్చందర్ గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు రైతులను భయపెట్టి ,ప్రలోభ పెట్టి భూములు తీసుకోవాలను కోవడం సరైన పద్దతి కాదన్నారు. భూముల ధరలు బయట ఎకరం ముప్పై లక్షల నుండి కోటి రూపాయలవరకు నడుస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013చట్ట ప్రకారం మూడింతలు కలిపి ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పదమూడు,పద్నాలుగు లక్షలు ఇస్తామనడం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రభుత్వం ఎక్కడైనా ఈరేటుకు భూమి కొనుగోలు చేసి చూయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న రైతులు సరైన పరిహారం ఇవ్వకపోతే భూములు ఇచ్చెప్రసక్తె లేదన్నారు. సమావేశంలో భూనిర్వాషితుల సంఘం జిల్లా నాయకులు గోపాల్, అంజిలయ్య, మహేష్ కుమార్,రైతులు ధర్మరాజు, లక్స్మికాంత్, కేశవ్, నారాయణ, నర్షిముసంతోష్ నరేష్ గౌడ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.