క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి
మండల స్థాయి, గ్రామస్థాయి, బూతు స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి
వనపర్తి, జులై 10 (మనఊరు ప్రతినిధి): జిల్లాలోని మండల స్థాయి, గ్రామస్థాయి బూతు స్థాయి కమిటీలను క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా మహిళా ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని గ్రామాలలో పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోసం అనేక అవకాశాలు ఉన్నాయని వినియోగించుకోవాలని ఆమె అన్నారు. గ్రామాలలో ముందుకెళ్లాలంటే ముందుగా కమిటీలు పూర్తి చేసుకోవాలని కమిటీల ఏర్పాటు పై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని సూచించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలకు ప్రధాన పాత్ర ఉంటుందని ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి మహిళకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవ అనిత, చిన్నంబావి అధ్యక్షురాలు అనూష, ఆత్మకుర్ అధ్యక్షురాలు విజయ, వనపర్తి మాజీ కౌన్సిలర్లు, రమాదేవి పద్మ, విజయ లక్ష్మి, జయసుధ, సత్యమ్మ , మహిళలు తదితరులు పాల్గొన్నారు.