ప్యాసింజర్ కు ల్యాప్ టాప్ అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది

 ప్యాసింజర్ కు ల్యాప్ టాప్ అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది 

జడ్చర్ల రూరల్, జులై 29 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని కొత్త బస్టాండ్ లో నారాయణపేట నుంచి హైదరాబాద్ వెలుతున్న బస్సులో ప్యాసింజర్ ప్రజ్వేల్ శాస్త్రి అనే వ్యక్తి ఆయన బ్యాగులో ల్యాప్ టాప్, వస్తువులు ఉన్న బ్యాగును ప్యాసింజర్ బ్యాగు పెట్టిన మర్చిపోవడం జరిగినది హైదరాబాద్ బస్సు బయలు దేరడంతో శంషాబాద్ వెళ్ళినాక ప్యాసింజర్ కు గుర్తుకు రావడం జరిగినది ..ఆర్టీసీ సిబ్బంది, జడ్చర్లకు చెందిన ఆర్టీసీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో బస్ స్టాప్ లో ఆర్టీసీ డ్యూటీలో ఉన్న స్టేషన్ మేనేజర్ రవింద్రనాథ్, ఏడిసి కండక్టర్ యాదగిరి, ట్రాఫిక్ గార్డ్స్ వెంకటయ్య, శివరాముడు, సెక్యూరిటీ గార్డు ఎల్. నర్సింహులు, జడ్చర్ల బస్టాప్ లో ప్యాసింజర్ కు ల్యాప్ టాప్ ను తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ల్యాప్ టాప్ ను తిరిగి అప్పగించడంతో ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Previous Post Next Post