బైకును ఢీ కొన్న ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్

 బైకును ఢీ కొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్

బైకును ఢీ కొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్

కరీంనగర్, జూలై 14 (మనఊరు ప్రతినిధి): ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్ సోమవారం ప్రమాదవశాత్తూ బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా గూడెం గ్రామానికి చెందిన సురేష్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. గాయపడిన సురేష్‌ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous Post Next Post