కాంగ్రెస్ పార్టీ.. బీసీల పక్షపాతి
వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
వనపర్తి, జులై 13 (మనఊరు ప్రతినిధి): దేశంలోనే తొలిసారి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా నిలిచిందని వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుని 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలుపరిస్తే అది చూసి ఓర్వలేని బిఆర్ఎస్ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు సమచిత స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంటే బిఆర్ఎస్ నాయకులు దయ్యాలు, వేదాలు వర్ణిస్తున్నట్టు ఉందన్నారు. కెసిఆర్ మీ కూతురు కవిత చెప్పారు మా పార్టీలో దయ్యాలు ఉన్నాయని, ఆ దయ్యాలను వెలగొట్టు తల్లి మీ పార్టీలో ఆ దయ్యాలు పోతే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు. స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితుని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి ఉంటే తీసివేశారు. బీసీ మంత్రి ఈటెల రాజేందర్ ని తీసివేశారు. మహబూబ్ అలీ హోం మంత్రిగా ఉంటే గేటు దగ్గర కూడా రానీయకుండా బయటకు పంపీయడం జరిగిందన్నారు. అలాంటి నీచమైన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు, జడ్పిటిసిలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు అందరికీ సమచిత స్థానం కల్పిస్తుందని అన్నారు.
_* బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు సీఎంను కలవడానికి అవకాశం లేకుండే*_
_*మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవడం జరుగుతుంది మా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు కలిసినట్లు గుర్తు చేశారు. గతంలో మీ మంత్రులు సీఎంను కలవడానికి అపాయింట్మెంట్ దక్కాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిలో ఉన్న దాని ప్రజా భవన్ గా చేయడం జరిగిందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్లు, బర్లు అంటూ కులాలను విడదీసే విధంగా చేశారని ఆయన తెలిపారు. ఎంతో కష్టపడి చదువుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కూడా మీరు ఆయనను అవమానపరిచారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా అన్ని కులాలకు లబ్ధి పొందే విధంగా న్యాయం జరగాలని మా నాయకుడు రాహుల్ గాంధీ, కాశి నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. అప్పుడే రాహుల్ గాంధీ చెప్పడం జరిగిందన్ని కులాలకు న్యాయం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగిందన్నారు. వారు చెప్పినట్టే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, బి కృష్ణ, మాజీ కౌన్సిలర్స్ బ్రహ్మంచారి, శరవంద, ఎల్ఐసి కృష్ణ, ఎస్.కె షఫీ, ఓబిసి పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ, టీపీసీసీ అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్ లతీఫ్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, డాక్టర్ లతీఫ్, ఎన్ ఎస్ యు ఐ అస్లాం ఇర్ఫాన్, వసీం, మన్సూర్, ఆలీ, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.