రవికళ్యాణ్ కు పద్మ ప్రతిభా జాతి అవార్డు
*భూమిరెడ్డి రవికళ్యాణ్ కు ఘన సత్కారం*
మైదుకూరు, జులై 13 (మనఊరు ప్రతినిధి): నీతి ఆయోగ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన మనం ఫౌండేషన్ తొమ్మిదేండ్ల విజయయాత్రను పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో హైదరాబాదులో చిక్కడపల్లిలో త్యాగరాయగాన సభలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. కవి సమ్మేళనంలో పుట్టిన రోజు అనే అంశంపై నాకానుక అనే శీర్షికతో కవితను, సాంస్కృతిక కార్యక్రమాలలో అంటరానితనాన్ని నిర్మూలిస్తూ సమాజంలో సమానత్వాన్ని ప్రతిబింబించే విధంగా పాటలను పాడి పోటీలలో ప్రతిభను కనబరిచినందుకు గాను భూమిరెడ్డి రవికళ్యాణ్ కు శ్రీ త్యాగరాజ గాన సభ కళావేదికపై మనం ఫౌండేషన్ చైర్మన్ కే.చక్రవర్తి ఆధ్వర్యంలో పద్మ ప్రతిభా జాతి అవార్డుతో ప్రముఖులైన హిమమాత్ నగర్ సీఐ పురుషోత్తం, హైకోర్టు అడ్వకేట్ శ్రీ రామమూర్తి, ఒరిస్సా ప్రొఫెసర్ ప్రవీణ్ దలై, తెలుగు తమిళహీరో కిరణ్ కుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రఘువీర్ ప్రతాప్, కడప జిల్లా కవి, రచయిత జింక సుబ్రహ్మణ్యం, వంశి ఫౌండేషన్ అధినేత వంశీ రామరాజు, బ్యాంక్ ఆఫీసర్ ప్రముఖ గాయకుడు శ్రీనాథ్ రామ్ లచే ఘనంగా సన్మానించి అవార్డును అవార్డు ప్రధానం చేశారు. ఈ యన శ్రీ బాలశివయోగేంద్ర మహారాజు డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, అటానమస్ సాహిత్య డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ జాన్ సెక్రటరీ ఉంటూ కళా,సామాజిక సేవ రంగాలలో అటు విద్యార్థులకు సమాజంలో ప్రజానీకానికి అవగాహన కల్పిస్తూ అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుందని విద్యార్థులను దేశభక్తి స్ఫూర్తిదాయకంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని కళా సేవకు అంకితమైన ప్రపంచ రికార్డు పొందిన సంస్థ శ్రీ త్యాగరాయగాన సభలో భూమిరెడ్డి రవికళ్యాణ్ కు పద్మ ప్రతిభ జాతీయ అవార్డుతో, సర్టిఫికెట్, మెడల్ తో ప్రముఖుల మధ్య ఘనసత్కారంలభించడం
ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా మైదుకూరు గొల్లపల్లి గ్రామానికి చెందిన భూమిరెడ్డి మనోహర్, భూమిరెడ్డి మార్తమ్మ దంపతుల చివరి కుమారుడు భూమిరెడ్డి రవి కళ్యాణ్ పలువురు నాయకులు, కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.