వైభవంగా సత్య సాయి మందిరంలో గురు పూర్ణిమ వేడుకలు

 *వైభవంగా సత్య సాయి మందిరంలో గురు పూర్ణిమ వేడుకలు**

*భక్తులచే సామూహిక అభిషేకాలు ప్రత్యేక అర్చనలు*

*ఆలయ ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర్ శర్మ*

నాగర్ కర్నూల్, జూలై 10 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం పక్కన గల భగవాన్ శ్రీ సత్యసాయి భావం మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువారం నాడు భక్తులచే సామూహిక అభిషేకాలు అర్చనలు గురుపౌర్ణిమ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర్ శర్మ తెలిపారు. జన్మ రిత్యా గోచార రీత్యా గురువు బలంగా ఉన్నప్పుడే నిత్యజీవనం సవ్యంగా సాగుతుందని ఆయన అన్నారు. సాయి మందిరంలో తెల్లవారుజామున షిర్డీ సాయినాథునికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు బస్వాభిషేకం,పూల,ప్రత్యేక ద్రవ్యాలతో అభిషేకాలు చేసినట్లు ఆయన తెలిపారు. సాయి మందిరంలో తెల్లవారుజాము నుండి రాత్రి వరకు విడుతలవారీగా భక్తుల సందర్శన జరిగింది. ప్రధోశకాలంలో ప్రత్యేక భజనలు నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, ఎలిమే ఈశ్వరయ్య,సువర్ణ, శారద ,బాలకృష్ణ,వివిధ విభాగాల కన్వీనర్లు యువత మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post