ప్యాసింజర్ రమాదేవికి సెల్ ఫోన్ అప్పగించిన రవీంద్రనాథ్
జడ్చర్ల రూరల్, జూలై 30 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల న్యూ బస్టాండ్‌లో బస్సులో మరిచిపోయిన సెల్‌ఫోన్‌ను బుధవారం తిరిగి ప్యాసింజర్ రమాదేవికి స్టేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు నెం TS 07 UJ 5589 సెల్ ఫోన్ ప్యాసింజర్ రమాదేవి మరిచి పోవడంతో కండక్బర్ SN మూర్తి గమనించి చూడగా ఎవరో సెల్ ఫోన్ మరిచియారని ఆ సెల్ ఫోన్ ను జడ్చర్ల ఆర్టీసీ మేనేజర్ VR నాథ్ కు సెల్ ఫోన్ ను అప్పజెప్పడం జరిగింది. ప్యాసింజర్ రమాదేవి తేలిపిన వివరాలు కర్కూల్ నుంచి జడ్చర్లకు రావడం జరిగిందని, జడ్చర్ల నుంచి షాద్ నగర్ పోవాలని షాద్ నగర్ బస్సు అనుకోని మహబూబ్ నగర్ బస్సు ఎక్కినది దానిలోనే సెల్ ఫోన్ పడిపోయిందని తెలిపారని. కొంత దూరం పోయినాక గమనించి ఫోన్ మహబూబ్ నగర్ బస్సులో పోయిందని జడ్చర్ల బస్టాండ్ సిబ్బందికి తెలుపడంతో వెంటనే కండక్టర్‌కు సమాచారం అందించారు. కండక్టర్ ఆ పోన్ జడర్లలో బస్సుసేషన్ లో అప్పగించారని తెలిపారు. ప్యాసింజర్ రమాదేవికి స్టేషను మేనేజర్ రవీంద్రనాథ్, కంట్రోలర్ మాదిగిరి, ట్రాపిక్ గైడ్ వెంకటమ్మ, ఆర్టీసీ సెక్యూరి గార్డ్స్ లింగపేట వర్సింహులు రాకేష్ నాయక్ లు అందజేసినట్లు తెలిపారు.