అందరి ఆశీస్సులతో అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు

 * ప్రజా పాలనలో అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు*

*మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్*



*కేశంపేట, జూలై 30 (మనఊరు ప్రతినిధి): అందరి ఆశీస్సులతో 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వేములనర్వ, పుట్టోని గూడ, తులవానిగడ్డ, కొత్తపేట, సుందరాపురం, కేశంపేట గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగింది. ఈ సందర్భంగా తూలవానిగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన నేతలు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా గొప్పగా చెప్పి ఎక్కడి పనులు అక్కడే వదిలేసి పోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైవడంతో పాటు ప్రజలకు నరకం చూపించిన నేతలు బిఆర్ఎస్ వాళ్ళు అన్నారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు మాట ఇచ్చిన నిలబెట్టుకునేందుకు ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన నాటి ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదని, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కడానికి. గతంలో పరిపాలించిన నేతలు ప్రజల బాగోగులు మరచి కుటుంబ ఆస్తులు భూములు పెంచుకోవడానికి పరిమితమయ్యారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పాటు చేయలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి సంక్షేమానికి డ్వాక్రా బిల్డింగులతో పాటు వడ్డీ లేని రుణాలు అందించబడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి నాటి ఇందిరాగాంధీ స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రకటించింది. గతంలో పరిపాలించిన మహిళలకు ఏమి చేశారో ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం మధ్య తేడాను గమనించింది. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అప్పుల కుప్పగా మార్చింది. గతంలో పరిపాలించిన ఎమ్మెల్యే ఇప్పుడు పరిపాలిస్తున్న ఎమ్మెల్యే మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు. కొందరు బిఆర్ఎస్ నేతలు కాలేశ్వరం ప్రాజెక్టు, మద్యం కుంభకోణాలలో ఇరుక్కుని ఆంబోతుల రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించడం మానుకోవాలన్నారు. గతంలో మండలాన్ని పరిపాలించిన నాయకులు ఆక్రమాలకు పాల్పడితే, నేడు పార్టీలకతీతంగా పనులు జరుగుతున్నాయి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామంలోని అందరూకట్టుగా ఉండి సంక్షేమ అభివృద్ధి పథకాలు కలిసి చేయాలని నాయకులు అన్నారు. అనంతరం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఎంపిక. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో కిష్టయ్య, తహసీల్దార్ ఆజాంఅలీ, మాజీ జెడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కర్ణాకర్, భాస్కర్ నాయకులు శ్రీధర్ రెడ్డి,సురేష్ రెడ్డి, అనసూయమ్మ, గిరి యాదవ్, కరుణాకర్ రెడ్డి, నిర్దవెల్లి అమేర్, విజయేందర్ రెడ్డి, రావుల పెంటయ్య, శ్రీనాథ్, కోడూరు రాములు, యారం భాస్కర్ రెడ్డి, తైద పర్వతాలు, సమీర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, ఉన్నారు.

Previous Post Next Post