పోచమ్మ దేవాలయ నిర్మాణానికి సిమెంట్ అందజెసిన ఉప్పల

 పోచమ్మ దేవాలయ నిర్మాణానికి సిమెంట్ అందజెసిన ఉప్పల

కల్వకుర్తి, జులై 9 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తర్నికల్ లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న పోచమ్మ దేవాలయానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సమకూర్చిన 75 సిమెంట్ బస్తాలను బుధవారం దేవాలయ కమిటీ సభ్యులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా అలయ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల సురేష్ గౌడ్ , వర్కాల దేవయ్య, పేర కృష్ణ ,గుండాల రాము తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post