*నాగర్ కర్నూల్ జిల్లా టి యు డబ్ల్యూ జే నూతన కార్యవర్గం ఎన్నిక.*
నాగర్ కర్నూల్, జూలై 9 (మనఊరు ప్రతినిధి): టి యు డబ్ల్యూ జే (ఐజేయు) నాగర్ కర్నూల్ జిల్లా నూతన కార్యవర్గం మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని రూబీ గార్డెన్స్ లో జరిగిన నాగర్ కర్నూల్ జిల్లా నాల్గవ మహాసభలో జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికల అధికారిగా సంఘం నేషనల్ కౌన్సిల్ మాజీ సభ్యుడు మల్యాల బాలస్వామి , రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ ఆధ్వర్యంలో ఈ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా పి.విజయ్ కుమార్ , ఉపాధ్యక్షులుగా విజయ్ రెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాసులు, బాలరాజు, ముబిన్ ఖాన్, కార్యదర్శిగా సురేష్, సంయుక్త కార్యదర్శిగా యాదయ్య, కృష్ణయ్య, రమేష్, వినోద్ కోశాధికారిగా పండరి శ్రీధర్, ప్రచార కార్యదర్శిగా చీకిరాల పట్టాభితో పాటు కార్యవర్గ సభ్యులుగా రవీందర్, బాలరాజు, రాజు, నిరంజన్, నారాయణ, శ్రీనివాసులు, మల్లేష్, భాస్కర్ , నాగేంద్రం, ఖాదర్ బాషా, రాజేష్, రాజవర్ధన్, ప్రసాద్, వెంకటేష్, రమణ కుమార్, శ్రీను బాబు లను జిల్లాలోని టి యు డబ్ల్యూజే ఐజేయు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.