విశ్వకర్మ యువత రాజకీయాల్లోకి రావాలి

 విశ్వకర్మ యువత రాజకీయాల్లోకి రావాలి


జడ్చర్ల రూరల్, జులై 10 (మనఊరు ప్రతినిధి): యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే విశ్వబ్రాహ్మణులు అభ్యున్నతికి బాటలు వేయవచ్చన ౠబులియన్ మార్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గోల్కొండ రాజేష్ చారి, ఉపాధ్యక్షులు ఇరివింటి రాజేష్ చారి, అధ్యక్షులు తల్లోజు భాస్కరాచారిలు అన్పారు. గురువారం విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు మొగ్గుచూపకపోవడం వల్లే విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చెందుతున్న వారిగానే మిగిలిపోతోందన్నారని అన్నారు. సృష్టికర్తలైన విశ్వకర్మలు ఇప్పుడు ఉన్న యాంత్రికరణ ప్రపంచంలో గడ్డు పరిస్థితిలో ఉన్నారని ఆ పరిస్థితిని అధిగమించేందుకు విశ్వకర్మ యువకులు ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్య నింపేందుకు విశ్వకర్మ యువ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడంఎే అభినందనీయమని తెలిపారు. యువత చైతన్యం కాకుండా ఏ సమాజ భవిష్యత్తు ముందడుగు వేయలేదని, యువత రాబోయే భవిష్యత్తును తమ ఆలోచనలు, కృషితో సుసంపన్నం చేసుకోవావన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారోజు కృష్ణమూర్తి, శ్రీనివాస్ చారి, రాజగోపాల్ చారి, సంతోష్ చారి, వేణుగోపాలాచారి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post