50వ వారం విజయవంతమైన ఉచిత భోజనం

 50వ వారం విజయవంతమైన ఉచిత భోజనం 

నవాబుపేట, ఆగస్టు 17 (మనఊరు ప్రతినిధి): "పరోపకారం మిదం జగత్ పుణ్యం " అనే నానుడి లోని ప్రతి అక్షరాన్ని నరనరానా వంటబట్టించుకున్న నవాబుపేట మండల కేంద్రానికి చెందిన ఊరుకొండ నరసింహ్మ చారి అలియాస్ అవుసుల నరసింహ్మచారి తన జీవితాన్ని మొత్తం సమాజ సేవకు అంకితం చేసి తనకు ఉన్న దాన్ని మొత్తం ఊరందరికీ పంచి పెడుతూ ఆ గ్రామ ప్రజల నుండి విశేష ఆదరాభిమానాలను, 

ప్రజాదరణను చురగొంటున్నారు.

నా ఊరు అంటే నా ఇల్లే, నా ఊరి వాళ్లు అందరూ నా ఇంట్లో వాళ్లే' అని భావిస్తూ నరసింహ్మచారి -ఒకవైపు తన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూనే మరో వైపు తన గ్రామాన్ని ఉద్ధరించే బాధ్యతను చేపట్టారు. ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి బాధ్యతలు లేకపోయినా ఆయన తన గ్రామ అభివృద్ధి గ్రామ ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. నరసింహ చారి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు అచ్చెరువొందుతున్నారు. ఊరి బాధ్యతా తీసుకున్నారు. గ్రామానికి అవసరమైన వివిధ పనులు ఏర్పాటు చేయడం, పెద్దవాళ్లకు కావాల్సిన మందులు అందించడమే కాదు- నెలకు దాదాపు కొన్ని వేల రూ ఖర్చు పెడుతూ నిత్యాన్నదానం, వృద్దులకు, వితంతువులకు ఆయన సమకూర్చిన కొంత పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సొంతూరిని మరెన్నో పల్లెలకూ ఆదర్శంగా తీర్చిదిద్దిన జిల్లా కేంద్రంలోని నవాబుపేట మండల కేంద్రంలో జెకె ట్రస్ట్ ప్రస్థానం ఇది... ప్రతి ఆదివారం భోజన సమయం కాగానే అంగడికి వచ్చే పేద ప్రజల కోసం తినడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధమైపోతాయి. వేడివేడి అన్నం, పప్పూ, పచ్చడీ, రసం, పెరుగు... ఇలా రకరకాల వంటకాల్ని వండి వడ్డించేస్తుంటారు. పనిమీద వచ్చిన పొరుగూరివాళ్లూ వరస కట్టేస్తారు. సరదాగా మాట్లాడుకుంటూ అందరూ కడుపు నిండా తిని వెళ్లిపోతారు. " కీ"శే"అమ్మ నాన్న కళావతమ్మ జగదీశ్వరాచారి గార్ల జ్ఞాపకార్థం మా కుటుంబ మొదటి వారసుడు చిరంజీవి ఆదృత్ కృతాన్ చారి చేతుల మీదుగా ప్రారంభించిన ఉచిత భోజన కార్యక్రమం ఈ వారంతో 50 వా వారం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్లు జెకె ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, నవాబుపేట మండల మాజీ చైర్మన్ వి. నర్సింహచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరికి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు.









Previous Post Next Post