కబ్రస్తాన్ భూమిని కబ్జా చేయాలని భావిస్తున్న రియాల్టర్లు

 *కబ్రస్తాన్ భూమిని కబ్జా చేయాలని భావిస్తున్న రియాల్టర్లు (భూబకాసురులు)*

 - న్యాయం చేయాలని ముస్లిం సంఘాల నిరసన

జడ్గచర్ల రూరల్, ఆగస్టు 18 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వం హాయంలో రంగనాయక గుట్ట వెనుక హలీంషా కలీంషా దర్గా సమీపంలో ముస్లింలకు స్మశాన వాటిక కొరకు ప్రభుత్వ భూమి కేటాయించారు. కొందరు జడ్చర్ల రియాల్టర్స్ ప్రభుత్వం కేటాయించిన స్మశాన భూమి తమదని సంబంధించిన పత్రాలు తమ వద్దా ఉన్నాయని గత కొన్ని సంవత్సరాల నుంచి వాదిస్తున్నారు. రంగనాయక గుట్ట ముందు భాగములో ఉన్న ముస్లిం స్మశాన వాటిక స్థలం లేనందున గత ప్రభుత్వం దర్గా ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కబ్రస్తాన్ కొరకు ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం కేటాయించిన భూమిని తమదని కొందరు ఆ భూమిలో బౌండ్రి కట్టుకున్నారు. కబ్రస్తాన్ కు కేటాయించిన తమకేదక్కాలని జడ్చర్ల ముస్లిం మజీద్ కమిటీ సభ్యులు, మత పెద్దలు మాకు కేటాయించిన భూమి మాకె దక్కాలని మండలాలు రెవెన్యూ అధికారి, స్థానిక ఎమ్మెల్యేలను కలసి విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకుంటే న్యాయ పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ముస్లిం సంఘానికి చెందిన కబ్రస్తాన్  భూమి రెవెన్యూ సిబ్బందితో సర్వే చేసి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Previous Post Next Post