*నాటి పాలకుల అరాచకాలను తుదముట్టించిన యోధుడు పాపన్న గౌడ్*
నాగర్ కర్నూల్, ఆగస్టు 18 (మనఊరు ప్రతినిధి): బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని 17వ శతాబ్ధంలోనే గొంతెత్తి నినదించడమే కాదు.. పిడికిలి ఎత్తి పోరాడి గెలిచిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జై గౌడ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సోమ ప్రగతిగౌడ్ కొనియాడారు. సోమవారం జిల్లా కేంద్రంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు వెంకట్ స్వామిగౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శనీయుడని, ఆయన సేవలు మరువలేవని, వీరత్వంతో సమాజంలో బహుజనల సంఘటితం, అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి అని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని గౌడ కులస్తులు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి జై గౌడ సంఘం మండలాధ్యక్షుడు యుగేందర్ గౌడ్, సత్యంగౌడ్, ప్రగతిగౌడ్, జ్యోతి, నాగరాజు, భాస్కర్ గౌడ్, రాజు, రంజిత్ గౌడ్, మహిళలు, గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.