విద్యార్థులకు నగదు పారితోషికాలు అందజేత*

 *విద్యార్థులకు నగదు పారితోషికాలు అందజేత* 

ఎర్రగుంట్ల, 15, (మనఊరు ప్రతినిధి): ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జరిగి. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం రమణ మాట్లాడుతూ ఆ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఇదే పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్నారు అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషిక గత ఏడాది పదవ తరగతి విద్యార్థిని వి. శిరీషకు సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ యర్రంరెడ్డి ఈశ్వర ప్రసాద్ రెడ్డి రూ. 10,116 ను ఆయన తమ్ముడు యర్రంరెడ్డి వీరబద్రారెడ్డి అందజేయగా, 1992 -1993 బ్యాచ్ పూర్వ విద్యార్థి, ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఇమ్మానియేల్ రూ. 5,116ను రెండవ అత్యధిక మార్కులు సాధించిన యం. కీర్తనకు ఆయన మిత్రుడు , ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు. అలాగే

 సన్ రైజ్ ఫైనాన్స్ అధినేత శ్రీ కె. శ్రీనివాసరెడ్డి రూ. 5,116నుండి పదిలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి ఐదు మంది విద్యార్థులు, వారాశి ఆక్సిజన్ అధినేత కొండ్రెడ్డి వాసుదేవ రెడ్డి కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి ఒక్కొక్క విద్యార్థికి రూ.1,116ను , అదనంగా పదిలో 550 మార్కులను సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు గత సంవత్సరం పాఠశాలలో పని చేసిన తెలుగు పండితురాలు శ్రీదేవి ఒక్కొక్క విద్యార్థికి రూ.1,000. ఈ నగదు బహుమతులను అందించిన దాతలకు ఉపాధ్యాయ బృందం ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్ర ఓబుళరెడ్డితో పాటు ఉపాద్యాయులు కొనసాగుతారు.

Previous Post Next Post