జడ్చర్లకు మరో అధునాతన సాంకేతిక శిక్షణ కళాశాల
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృషి ఫలితం –
రాజాపూర్ మండలంలో ఈద్గానిపల్లి లో ₹45 కోట్లతో ఏర్పాటుకానున్న ఏటీసీ కళాశాల
- ఈద్గాన్ పల్లి గ్రామానికి ఏటిసి కళాశాల వరం – ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు
- ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృషికి ఫలితం – మండల ప్రజలు, విద్యార్థుల కృతజ్ఞతలు
జడ్చర్ల రూరల్, ఉన్నఆగస్టు 18 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల నియోజకవర్గానికి శుభవార్త. రాజాపూర్ మండలంలోని ఈద్గాన్ పల్లి గ్రామంలో ₹45 కోట్ల రూపాయల వ్యయంతో నూతన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసి) కళాశాల మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కళాశాల మంజూరుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృషి ప్రధాన కారణమని స్థానిక ప్రజలు తెలిపారు. మండలంలో కొత్తగా ఏర్పడుతున్న ఈ విద్యాసంస్థ వలన అనేక మంది విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు లభించనున్నాయి.
ఇప్పటికే ఐఐఐటి కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు ఏటీసి కళాశాల మంజూరై విద్యా వ్యవస్థ మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ సంతోషకర విషయంపై మండల ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.