డబ్బా పాలు వద్దు తల్లిపాలే ముద్దు..
నవజాత శిశువుకు తల్లిపాలే అమృతం లాంటివి......
ప్రతి బాలింత శిశువుకు తల్లిపాలే తప్పనిసరిగా ఇవ్వాలి.
బాలింతలకు 50 నవజాత శిశు కిట్ల పంపిణీ.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి న్యాయమూర్తి నసీం సుల్తానా
తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సోమవారం నాడు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి న్యాయమూర్తి నసీం సుల్తానా పాల్గొని ప్రసంగించారు.ఆమె మాట్లాడుతూ తల్లిపాలు పుట్టిన శిశువుకు అమృతం లాంటిదని ప్రతి బాలింత తప్పనిసరిగా పాలించ సమయంలో శిశువులకు తల్లిపాలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి ఉషారాణి మాట్లాడుతూ మాతృత్వం మహిళలకు ఒక వరమని మాతృత్వం ఆస్వాదించుటలో శిశువుకు తల్లికి గల సంబంధమే ఎంతో గొప్పదని,పుట్టిన గంటలోపు తప్పనిసరిగా జన్మించిన ప్రతి శిశువుకు తల్లిపాలు పట్టించాలని ఆ సమయంలో పాలు గోధుమ రంగులో ఉంటాయని వాటినే మురుపాలంటారని, ముర్రుపాలు ప్రతి శిశువుకు ఇవ్వడంతో రోగనిరోధశక్తి జ్ఞాపకశక్తి ఆరోగ్య స్థితి మెరుగు పడటానికి ఎంతో దోహదపడతాయని ఆమె అన్నారు.తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి. బిడ్డను రోగాలబారి నుంచి రక్షించే దివ్యమైన ఔషధం అని అన్నారు.బిడ్డ పుట్టిన వెంటనే తల్లి నుంచి వచ్చే ముర్రుపాలు పట్టడంతో శిశువులో రోగనిరోధక శక్తి పెర గడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయని తెలిపారు.పోత పాలకంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా మంచి ఐ.క్యూ, తెలివితే టలతో ఉంటారనీ అన్నారు.శిశు మరణాలు నివారించొచ్చనీ,ఎక్కువ మంది చంటి పిల్లల్లో ఇన్ఫెక్షన్ రావడం, పుట్ట గానే కామెర్లు, శ్వాసకోశవ్యాధులతో మరణాలు సంభవించడాన్ని నిరోధించవచ్చునని అన్నారు. అలాంటి మరణాలను నివా రించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని అన్నారు.స్త్రీ వైద్య నిపుణుల ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ మాట్లాడుతూ బిడ్డకు పాలు ఇవ్వడం తల్లికీ ప్రయోజనమే అన్నారు.