కొండారెడ్డిపల్లిలో ఏకగ్రీవం…
సీఎం చిన్ననాటి మిత్రుడు వెంకటయ్యకు సర్పంచ్ పగ్గాలు
వంగూరు, నవంబర్ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవి ఎస్సీ’గా ప్రకటించబడడంతో గ్రామానికి చెందిన సీఎం చిన్ననాటి మిత్రుడు వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా మారింది. ఈ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో సర్పంచ్ పదవికి మొత్తం 15 మంది అభ్యర్థులు ముందుకు రావడంతో పోటీ హోరాహోరీగా మారే అవకాశాలు కనిపించాయి. అయితే సీఎం సొంత గ్రామం కావడంతో గ్రామ అభివృద్ధి దిశగా ఏకగ్రీవం ఉత్తమ మార్గమని పెద్దలు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో.
పెద్ద గ్రామాలు, అభ్యర్థుల సమావేశమై, పోటీలో ఉన్న 15 మంది పేర్లను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అనంతరం పోటీదారుల పేర్లలో ఒకరిని సీల్డ్ కవర్ ద్వారా ఎంపిక చేయడం అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ ప్రక్రియలో సీఎం మిత్రుడు వెంకటయ్య ఎంపిక కావడంతో గ్రామంలో విశేష సానుకూలత. ఏకగ్రీవం ద్వారా గ్రామంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్ముతున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.
