యంగంపల్లిలో సర్పంచ్ పదవి బరిలో శ్రీనివాసరెడ్డి
కల్వకుర్తి, నవంబరు 29 (మనఊరు ప్రతినిధి): మండలంలోని యంగంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువత భారీగా తరలి రావడంతో నామినేషన్ ర్యాలీ గ్రామంలో ఉత్సాహాన్ని నింపింది. పలువురు స్థానిక నాయకులు పాల్గొని అభ్యర్థికి ఐక్య మద్దతు ప్రకటించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి సాధించేందుకు శ్రీనివాసరెడ్డి కృషి చేస్తారని వారు తెలిపారు. గ్రామంలో శుద్ధి నీటి సమస్యలు పరిష్కారం, రహదారుల అభివృద్ధి, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల మెరుగుదల ప్రధాన లక్ష్యాలుగా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు అభ్యర్థి వెల్లడించారు. గ్రామ ప్రజల అభిమానంతో, కార్యకర్తల ఐక్యతతో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే జిల్లేల అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు జిల్లెల్ల అభ్యర్థి రాజేశ్వరి రాజేశ్వర్ గౌడ్, మాచర్ల అభ్యర్థిగా బి. భారతమ్మలు నామినేషన్ దాఖలు చేశారు.
