మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక శానిటేషన్ తనిఖీలు
జడ్చర్ల, నవంబరు 27 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రత పనులపై కమిషనర్ జి. లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనేక వార్డుల్లో శానిటేషన్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన కమిషనర్, సిబ్బందికి తక్షణం అమలు చేయాల్సిన పలు సూచనలు, మార్గదర్శకాలను అందించారు. ప్రతి కాలనీ పరిశుభ్రంగా ఉండే బాధ్యత ప్రజలతో పాటు మున్సిపల్ శాఖపైనే ఉందని కమిషనర్ గుర్తుచేశారు. చెత్తను స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అప్పగించాలని, రోడ్ల పైభాగంలో లేదా మూలల్లో వదిలేయరాదని ప్రజలను కోరారు. ఈ పర్యటనలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, కౌన్సిలర్ సతీష్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
