ఘనంగా ‌రాజ్యాంగ దినోత్సవం

ఘనంగా బాలానగర్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

బాలానగర్, నవంబర్‌ (మన ఊరు ప్రతినిధి): మండల కేంద్ర మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యాంగంగా పేరుగాంచిందని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని పేర్కొన్నారు.  బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బాలానగర్ మండలం అంబేద్కర్ సంఘం  , ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.

Previous Post Next Post