ఘనంగా నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట

 ఉభయ రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట

వడ్డేపల్లి, నవంబరు 26‌ (మనఊరు ప్రతినిధి): జోగులంబా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామంలో ఉభయ రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిస్థాపన పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. రావిశాస్త్రి ఆధ్వర్యంలో గోమాత పూజతో కార్యక్రమాలు ప్రారంభమై నవగ్రహ హోమం, విగ్రహాల ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్‌ సల్కాపురం దామోదర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి దివ్య దర్శనం పొందారు. హోమం, పూజ కార్యక్రమంలో గజేంద్రరెడ్డి, భీమేశ్వర్ రెడ్డి, ఆర్‌.యన్‌. బీచుపల్లి, లింగన్న, సాయికుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, పొట్లపాటి సత్యరెడ్డి, సుధాకర్ రెడ్డి, రవిశెట్టి, నరేంద్ర, శివస్వామి, విష్ణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post