10వ తరగతి విద్యార్థులకు విద్యా సంకల్ప దీక్ష
డిస్టింక్షన్ లక్ష్యంగా శ్రమించండి
వందేమాతరం ఫౌండేషన్ రవీందర్
చౌడాపూర్, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): మండలంలోని మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సంకల్ప దీక్ష ప్రేరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. విద్యార్థులు డిస్టింక్షన్ లక్ష్యంగా చదివి, వచ్చే నాలుగు నెలలు పూర్తిగా చదువుకు అంకితం చేయాలని సంస్థ వ్యవస్థాపకులు రవీందర్ పిలుపునిచ్చారు. టీవీ, ఫోన్ దూరంగా పెట్టి ఏకాంతంగా చదివితే పదికి పది శాతం మార్కులు సాధించడం సాధ్యమని చెప్పారు. మంచి ర్యాంకులు సాధించిన వారికి ఇంటర్‌లో ప్రముఖ కాలేజీల్లో ఉచిత సీట్లు లభిస్తాయని తెలిపారు. ఉత్సాహం ఉన్నా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సౌజన్య, ఉపాధ్యాయులు మల్లప్ప, రామకృష్ణ, వెంకయ్య, మల్లయ్య, శివప్రసాద్, శశిధర్, అంజిలయ్య, పాండురంగాచారి, శ్రీలక్ష్మి, మనీష తదితరులు పాల్గొన్నారు.
