టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా సహాయ కార్యదర్శిగా ప్రభాకర్
జిల్లా సహాయ కార్యదర్శిగా యం. ప్రభాకర్
జడ్చర్ల, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయు) మహబూబ్‌నగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జడ్చర్ల పట్టణానికి చెందిన యం. ప్రభాకర్ (మనతెలంగాణ రిపోర్టర్) జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా బాధ్యతలు స్వీకరించడం జడ్చర్ల జర్నలిస్టులు హర్షం వ్యక్త చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, అదేవిధంగా ఐజేయు బలోపేతానికి తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. నూతన కమిటీ ఎన్నికతో యూనియన్ కార్యకలాపాలు మరింత చురుకుదనం సంతరించుకుంటాయని జిల్లా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
