విద్యూత్ ట్రాన్స్ ఫార్మర్లు ప్రారంభం

 డబుల్‌బెడ్‌రూం కాలనీలో రెండు కొత్త ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభం

కల్వకుర్తి, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని డబుల్ బెడ్‌రూం హౌసింగ్ కాలనీలో శుక్రవారం విద్యుత్ సమస్యల నివారణకు రెండు కొత్త ట్రాన్స్ఫార్మర్లను మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న తక్కువ వోల్టేజ్, తరచూ ఏర్పడే విద్యుత్ అంతరాయాలు నివారించేందుకు ప్రత్యేకంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని సమస్యలు తెలుసుకుని వీటి పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, మాజీ కోఆప్షన్ మెంబర్ మసూద్, సిపిఎం నాయకులు ఆంజనేయులు, అలాగే డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు పాల్గొన్నారు. 

Previous Post Next Post