** వంగూర్ మండలంలో కాంగ్రెస్ ఝలక్
27 గ్రామాల్లో 19 పంచాయతీలపై పట్టు**
వంగూర్, డిసెంబర్ 11 (మనఊరు ప్రతినిధి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వంగూర్ మండలం కాంగ్రెస్ పక్షానికి భారీగా రిజల్టులు వచ్చాయి. మొత్తం 27 పంచాయతీల్లో కాంగ్రెస్ 19 స్థానాలు కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 7 స్థానాలకే పరిమితమైంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. కొండారెడ్డిపల్లి పంచాయతీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ ఖాతాలో చేరింది.
పంచాయతీ వారీగా విజేతలు – పార్టీ వివరాలు
కాంగ్రెస్ – 19 పంచాయతీలు వంగూరు – పురుగుల యాదయ్య, రంగాపూర్ – క్యామ మల్లయ్య, సర్వారెడ్డిపల్లి – సంపత్ రావు, తుమ్మలపల్లి – సురేష్, తిప్పారెడ్డిపల్లి – శ్రీను, నిజాంబాద్ – రాజిరెడ్డి, కోనాపూర్ – క్యామ మంజుల, పోతారెడ్డిపల్లి – చంద్రశేఖర్, ఉప్పల్ పహాడ్ – ఖలీల్వెం, కటాపూర్ – హరీష్ రెడ్డి, ఉల్లంపల్లి – సలేశ్వరం, చౌదర్ పల్లి – నరేందర్ రెడ్డి, తిరుమలగిరి – మూడవ నీల, చాకలి గుడిసెలు – శ్రీశైలం, కోనేట్ పూర్ – బాలయ్య, మిట్ట సదగోడు – మంద అరుణ, అన్నారం మెరుగు – గోవర్ధన్ రెడ్డి, రంగాపూర్ తండా – రవీందర్ నాయక్, కొండారెడ్డిపల్లి – ఏకగ్రీవంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ – 7 పంచాయతీలు, ఉల్పర – కృష్ణయ్య, జాజాల – సైదులు, సర్వారెడ్డిపల్లి తండా – జీవన్, గాజర – శ్రీపతిరావు, డిండిచింతపల్లి – రామ్ భీష్మ, వెలుమలపల్లి – రామస్వామి, పోల్కంపల్లి – అంకు నారమ్మ, స్వతంత్ర విజయం – 1 పంచాయతీ ఉమ్మాపూర్ – శివ సాయి (ఇండిపెండెంట్) లుగా గెలుపొందారు.
