పాలెం వెంకన్న దేవాలయ హుండీ లెక్కింపు – రూ. 2,74,996 ఆదాయం
బిజినెపల్లి, డిసెంబరు 2 (మనఊరు ప్రతినిధి): మండలంలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలెర్మెల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. నాగర్‌కర్నూల్ దేవదాయ శాఖ జిల్లా పర్యవేక్షకులు టి. మదన్‌కుమార్ పర్యవేక్షణలో, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, చైర్మన్ మనుసాని విష్ణుమూర్తి ఆధ్వర్యంలో భక్తులు ఈ లెక్కింపును చేపట్టారు.
ఆగస్టు 30 నుండి మంగళవారం వరకు వచ్చిన హుండీ ఆదాయం రూ. 2,74,996 గా నమోదైనట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సి.హెచ్. రంగారావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు సమర్పించిన మూఢుపూలు, కానుకలను కూడా గణించారు.
హుండీ లెక్కింపు అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు స్వామి–అమ్మవార్ల తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యులు, జయంత్, శుక్లా, చక్రపాణి, మాజీ ప్రజా ప్రతినిధులు జగన్ మోహన్, విశ్రాంత ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ రెడ్డి, ఆలయ సిబ్బంది బాబయ్య, శ్రీవారి సేవకులు జగదీష్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




