కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సుదర్శన్ గౌడ్

 పాలమూరు పిఎసిఎస్ చైర్మన్ల ఫోరం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరిక

జడ్చర్ల రూరల్, డిసెంబరు 2 (మనఊరు ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లా పిఎసిఎస్ చైర్మన్ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా, అలాగే జడ్చర్ల పిఎసిఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పాలెం సుదర్శన్ గౌడ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, భవిష్యత్తులో గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సుదర్శన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Previous Post Next Post