శ్రీశైల కొండల్లో మల్లన్న భక్తి గీతం ఆవిష్కరణ
బాదిమి శివకుమార్ చేతుల మీదుగా విడుదల
జడ్చర్ల, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మల్లన్న భక్తుల కోసం రూపొందించిన శ్రీశైల కొండల్లో మల్లన్న శివభక్తి పాటను మాజీ సంగీత అకాడమీ చైర్‌పర్సన్ శ్రీ బాదిమి శివకుమార్ శుక్రవారం విడుదల చేశారు. గురుస్వామి బొడ్ల విజయకుమార్ స్వయంగా రాసి, ఆలపించిన ఈ గీతాన్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న భక్తిరసాన్ని ప్రజల్లో విస్తరించడం లక్ష్యం అని తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత, శ్రీశైల శివుని కీర్తిని అందరికీ చేరవేయాలన్న భావంతో ఈ గీతాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధ్యాసమౌని కృష్ణయ్య గురుస్వామి, కరకల కృష్ణారెడ్డి, పెద్ది పెంటయ్య, మిర్యాల వేణుగోపాల్, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ నయుముద్దీన్, డాక్టర్ సత్యనారాయణ, ఆర్యసమాజం అధ్యక్షులు గుబ్బ నర్సింలు, విట్టలయ్యతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
