ఆదరించండి... అభివృద్ధి చేస్తా

 ఆదరించండి... అభివృద్ధి చేస్తా

రాణిపేటలో ప్రచారంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మాధవి

మిడ్జిల్, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): సర్పంచ్‌గా తనను గెలిపిస్తే రాణిపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కర్నెకోట మాధవి మల్లేష్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గ్రామస్తులతో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల పెంపు, శానిటేషన్, తాగునీరు, వీధి వెలుగులు సహా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో రాణిపేటను మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో తనను గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు.



Previous Post Next Post