ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడుచుకోవాలి
కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి
సంతోషిమాత దేవాలయంలో విశేష హనుమాన్ చాలీసా పారాయణం
45 రోజుల ఇంటింటా హనుమాన్ చాలీసా కార్యక్రమం ముగింపు
ఘనంగా 24వ వార్డులో శోభాయాత్ర
జడ్చర్ల, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): మనిషి నిజమైన ఆనందం, నీతి, సాత్వికతకు భక్తిమార్గమే దారి చూపుతుందని మునిసిపల్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస శుభ సందర్భం పురస్కరించుకొని పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో గత 45 రోజులుగా ఇంటింటా హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం శోభాయాత్రతో ప్రారంభమై, అనంతరం సంతోషిమాత దేవాలయంలో సామూహికంగా మూడు సార్లు విశేష హనుమాన్ చాలీసా పారాయణంతో ముగిసింది. కాలనీలోని అన్ని హిందూ భక్తులు పాల్గొని ప్రాంతమంతా భక్తిరసంతో నిండిపోయింది. సామూహిక హనుమాన్ చాలీసా పఠనానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. అనేకమంది భక్తులు ఒకేచోట కూడి పఠిస్తే దైవానుగ్రహం విస్తారంగా లభిస్తుందని, ప్రాంతం పవిత్రమవుతుందని, శాంతి–ఐక్యత నెలకొంటుందని తెలిపారు.
సామూహిక పారాయణం ఫలితాలు:
• భక్తుల సమూహ శక్తి పెరుగుదల
• చెడు శక్తుల నివారణ, పవిత్ర వాతావరణం
• శాంతి సమాజంలో, ఆరోగ్యం, ధైర్యం
• కుటుంబాల్లో ఐకమత్యం, అభ్యుదయం
• దృష్టిదోష నివారణ, శత్రునాశనం
• ఆర్థిక స్థిరత్వం, విజయాలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందకు పైగా కుటుంబాలు కలిసి హనుమాన్ చాలీసా చదివితే అది ఆ తర్వాత రక్షణ కవచంలా పనిచేస్తోంది. అభ్యుదయానికి కూడా ఈ సామూహిక పారాయణం శుభఫలితాలు అందజేయాలని కోరుకున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు వజ్రాలింగం, నాగరాజు, సంజీవ గురూజీ, సాహితీ రెడ్డి, కనకప్ప, చలపతి, రాములు, బాలస్వామి, శోభన్ బాబు, లవకుశ, కాలనీ భక్తులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో ఉన్నారు.




