గొర్రెలకు నట్టల మందు పంపిణీ

చర్లపల్లిలో గొర్రెలకు నట్టల మందు పంపిణీ

యాదవ సోదరులకు భరోసా కల్పించిన సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ

జడ్చర్ల రూరల్, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని చర్లపల్లి గ్రామంలో మంగళవారం యాదవ సోదరుల జీవనాధారమైన గొర్రెలకు నట్టల మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొర్రెలకు రోగాలు రాకుండా ముందస్తు చర్యలుగా నట్టల వేయించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో పశుపోషణపై జీవిస్తున్న పశుపాలకులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ పావని అనిల్ గౌడ్‌, గొల్ల గోపాల్, నారప్ప, తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post